Pages

Lord Swapnika - Telugu Poem

స్వప్నిక


సుందర ప్రేమానురాగాల ఊయలలో

మధుర స్వప్న సుందరిగా పుట్టావో

పట్టుమని పదిహేను సంవత్సారాలైనా

నిండుగా ఆనందించలేదేమో

ఎక్కడికి వెళ్ళిపోయావు?

వ్యాఘిరాలా ఏరులోకి వెళ్ళిపోయావు?

లూసీ గ్రే చిట్టడుగులు కనిపించాయి ఆనాడు

నీ జాడలు ఇప్పుడు

వీధుల సందులలో చూసేది?

ఆనాడు ఆమ్లములు క్షారములు అంటే

రసాయినిక ప్రయోగశాల

ఈనాడు ... ...

ఇదేనా నా రుద్రమ దేవి, మొల్ల జనించిన

తెలుగు గడ్డ ఇదేనా?


మళ్ళీ జన్మంటూ వుంటే

నీకు - నాకూ

రా మా ఇంట్లోకి - 'దివిలో విరిసిన పారిజాతంలా'

దత్తతైనా చేసుకొంటా

మోనకో రాకుమారిలా చూసుకొంటా

ఉంచుతా నిన్ను

అపరిపక్వ మూర్ఖ మగ జల్సారాయలకి దూరంగా

సుదూరంగా ఒక స్వర్గతుల్య కోనసీమ ద్వీపంలో

సహృదయుల పొరిగింట పెద్దల సంరక్షణ చూపుల డోలలో

- అత్రి

Copyright 2009

(December 31, 2011 is the tragic third anniversary of Swapnika)