భారతీయ యోగ సమ్మేళనం
కేకలతూరి క్రిష్ణయ్య
మానవుడు సుఖంగా జీవించుటకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం, దైవ భక్తి అవసరం. అటువంటి స్థితిలోకి మనిషి రావటానికి మంచి ఆహారం, గాలి, నీరు, క్రమశిక్షణ, నిత్య వ్యాయామం, సత్సాంగత్యం అవసరం, సృష్టిలో కొన్ని నియమాలు ధర్మాలు ఉన్నాయి. మన కోసం సృష్టి ధర్మాలు మార్పు చెందవు. వాటికి అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకోగలిగిన వారి జీవితం క్షేమం, ధన్యం. సృష్టి ధర్మాలననుసరించి తీసుకోవలసిన ఆహారం, విధానము, వ్యాయామం, యోగాసనములు, ప్రాణాయామం, ధ్యానం చాలా వివరంగా తెలుపబడినవి. వివిధ యోగులు, యోగ మాస్టర్లు నేర్పిన పద్ధతులు ఇందులో తెలుపబడినవి. మరియు సిద్ధ సమాధియోగ, శ్రీ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీ ప్రసాదు మాస్టారు క్రియా యోగ, శ్రీ గురు రాందేవ్ ప్రాణాయామం, పరమ హంస యోగానంద క్రియాయోగ, శ్రీ లహరీ గారి జీవిత చరిత్ర, క్రియాయోగలో వారి బోధనలు, 5000 ఏండ్ల నుండి చిరంజీవిగా ఉన్న బాలాజీ గారి జీవిత చరిత్ర, 280 సంవత్సరములు జీవించిన ఆంధ్ర యోగి త్రైలింగస్వామి, ఇంకా హిమాలయ యోగుల గురించి, ఆహారం నీరు తీసుకోకుండా ప్రాణశక్తితో జీవించిన గిరిబాల గురించి, మొదలగు యోగ, వేదముల రహస్యాలతో మీ సందేహాలు తీర్చుకుని మీ జీవిత గమ్యం నిర్ణయించుకోవడానికి చక్కగా ఈ పుస్తకం ఉపయోగపడగలదని నమ్ముచున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య