తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మస(ల)లుతూ ఉండేవు, మారాము చాలింక లేరా, మారాము చాలింక లేరా
కలకలమని పక్షిగణములు చెదిరేను, కళ్యాణగుణధామ లేరా
తరుణులందరు దధి చిలికె వేళాయె దైవరాయ(యా) నిదుర లేరా
నల్లనయ్య రారా, ననుకన్నవాడా,
బుల్లితండ్రి రారా, బుజ్జాయి రారా,
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను, వెన్న తిందువు గాని రారా
వెన్న తిందువు గాని రారా
tellavaaravacce teliyaka naa saami
maLLii parunDEvu lEraa, maLLii parunDEvu lEraa
maLLii parunDEvu masalutuu unDEvu, maaraamu caalinka lEraa, maaraamu caalinka lEraa
kalakalamani pakshigaNamulu cedirEnu, kaLyaaNaguNadhaama lEraa
taruNulandaru dadhi cilike vELaaye daivaraaya(yaa) nidura lEraa
nallanayya raaraa, nanukannavaaDaa,
bullitanDri raaraa, bujjaayi raaraa,
naannaa mii amma gOpemma pilicEnu, venna tinduvu gaani raaraa
venna tinduvu gaani raaraa
film: chiranjiivulu
Lyrics: Malladi
Singer: P. Leela
Music: Ghantasala