Pages


Showing posts with label Vaibhav Lakshmi. Show all posts
Showing posts with label Vaibhav Lakshmi. Show all posts

Lord Vaibhava Lakshmi Vratham

Vaibhava Lakshmi Vratham
Vaibhava Lakshmi Vratham
Vaibhava Lakshmi Vratha Vidhanam, How to Perform Vaibhav Lakshmi Vrat?, Vaibhava Lakshmi Puja, Vaibhav Laxmi Vrat

వైభవలక్ష్మి వ్రతం
Vaibhava Lakshmi Vratham

ముందుగా కలశముపై గిన్నెలో ఉంచిన శ్రీ వైభవలక్ష్మి దేవి యొక్క స్వర్ణ ప్రతిమనుగాని, వెండి ప్రతిమనుగాని లేదా ఏదైనా ప్రస్తుతము చలామణి లో వున్న నాణెమును గాని శుద్ధిచేసి అందులో వుంచవలెను.

ప్రాణ ప్రతిష్ట:
ఓం అస్యశ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణు మహేశ్వరా ఋషయః ఋగ్యజుర్సామా ధార్వాణి చందాసి ప్రాణః శక్తి, పరాదేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తి , క్రోం కీలకం, శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః,
అంగన్యాసము:
హ్రాం అంగుష్టాభ్యాం నమః
హ్రీం తర్జనీభ్యాం నమః
హ్రూం మధ్యమాభ్యాం నమః
హ్రైం అనామికాభ్యాం నమః
హ్రౌం కనిష్టికాభ్యాం నమః
హ్రః కరతలకర పృష్టాభ్యాం నమః

హృదయన్యాసం:
హ్రాం హృదయాయ నమః
హ్రీం శిరసే నమః
హ్రూం శిఖాయై వషట్
హ్రైం కవచాయహుం
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భందః
ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ఇహప్రాణ, ఓం ఆం హ్రీం క్రోం శ్రీ వైభవలక్ష్మి సర్వేంద్రియ వాజ్మనశ్చక్షు శ్రోత్రజిహ్వఘ్రాణ, కరచరణాదిభి ఇహైవాగాచ్చ.
ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణ మిహనో దేహిభోగం | జోక్పశ్యేమ సూర్యముచ్చారంతా మనుమతే మ్రుడయానస్వస్తి| అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవయదా స్థాన ముపహ్వాయతే, సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ వైభవలక్ష్మిమ్ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి.

ధ్యానం:
శ్లో: పద్మాంగీ పద్మజా పద్మా పద్మేషి పద్మవాసినీ,
పద్మపాత్ర విశాలాక్షి పాతుమాం శ్రీ రామా సదా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్తలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:
శ్లో: ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
చంద్రకాంత మణిస్థంభ సౌవర్ణం సర్వసుందరం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యం:
శ్లో: ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో: వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

పంచామృత స్నానం:
ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణ్య మ్భ, భవా వాజస్య సంగథే. (పాలు)
ఓం దధి క్రావ్ణో అకారి షం జిష్ణోర శ్వ స్య వాజినః సురభి నో ముఖా కరత్ప్ర ణ ఆయోగ్గ్ షి తారి షత్. (పెరుగు)
ఓం శుక్రమసి, జ్యోతిరసి, తెజోసి దేవోవస్వితాత్పునః, త్వచ్చిద్రేనా పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి. (నెయ్యి)
ఓం మధువాతా ఋతాయతే మధుక్ష రన్తి సివ్దవః మాద్వీర్న స్సన్త్వో షధీః,
మధునక్త ముతో మధుమత్పార్థి వగ్గ్ రజః మధుద్యౌ రన్తు నః పితా
మధుమాన్నో వన స్పతిర్మధుమాం అస్తు సూర్యః మాధ్వి ర్గావో భవస్తు వః. (తేనే)
ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే,
స్వాదుమిత్రాయ వరునాయ వాయవే, బృహస్పతయే మధుమాగుం అదాభ్యః (పంచదార)
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:
శ్లో: హత్యాది పాపశమనే హరిదశ్వాది వందితే,
సువర్ణ కలాశానీతే శీతై స్నాహి శుభై ర్జలై.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రం:
శ్లో: సకారారూపి సర్వేశీ సర్వహన్త్రీ , సనాతనీ,
సౌవర్ణాచల సంయుక్తం వస్త్రయుగ్మం చ ధారయ.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమఃవస్త్రయుగ్మం సమర్పయామి.

ఆభరణాదికం:
శ్లో: కకారాఖ్యే కమలాఖ్యే కామితార్ధ ప్రదాయిని,
భూషణాని స్వీకురుష్వ మయాదట్టాని హి రమే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః సమస్త దివ్యాభరణాని సమర్పయామి.

గంధం:
శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శ్రీ గంధం సమర్పయామి.

కిరీటం:
శ్లో: విష్ణుపత్ని విశ్వరాజ్ఞి లయస్తిత్యుద్భావేశ్వరి
సువర్ణా అక్షతాన్ దేవి గృహాణ కరుణాకరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నవరత్న ఖచిత కిరీటాదికాన్ సమర్పయామి.

అక్షతాన్:
శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్ప సమర్పణ:
శ్లో: క్షీర సాగర సంభూతం ఇందిరా మిందుసోదరి,
కుందమందార పుష్పాదీన్ గృహాణ జగదీశ్వరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పుష్పాంజలీం సమర్పయామి.

అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః - భుజాన్ పూజయామి
ఓం కంభుకంట్ట్యై నమః - కన్ట్టం పూజయామి
ఓం సుముఖాయై నమః - ముఖం పూజయామి
ఓం శ్రియై నమః - ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః - నేత్రే పూజయామి
ఓం రమాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం కమలాలయాయై నమః - శిరః పూజయామి
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ వైభవలక్ష్మిదెవి అష్ట్తోత్తర శతనామావళి
Vibhava Lakshmi Astottara Shata Namavali

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం అసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
శ్రీ వైభవలక్ష్మిదెవ్యై నమః

ధూపం:
శ్లో: క్షీరోత్తుంగా తరంగజే శ్రీ విష్ణు వక్షస్థల స్థితే
ధూపం గృహాణ కమలే పాపం నాశయ పాహిమాం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం:
శ్లో: సర్వలోక ప్రాణరూప జగదైక ప్రకాశిక
దీపం గృహాణ దేవేశి భక్త్యా ప్రజ్వలితం మయా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః దీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో; సర్వాతిషయ సర్వాంగ సౌందర్యా లబ్ద విభ్రమే
కాలేకల్పిత నైవేద్యం త్వం గృహాణ మయార్పితం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:
శ్లో: రాగినీ రాగకృతు రాగేషి రాగాలోలుపే
త్వంగ్రుహాణ మహాదేవి తాంబూలం వక్త్రరాగిణి
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:
శ్లో: శుద్ధ జ్యోతి మోక్షజ్యోతి పరంజ్యోతీ పరాత్మికే పరం జ్యోతీ
నీరాజనం గృహాణేదం పరంజ్యోతి శుభప్రదం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం:
శ్లో: సర్వమంత్రప్రదే దేవి సర్వ మంత్రాన్తరాత్మికే
పంత్రపుశ్పం గృహాణేదం సర్వమంత్ర నిమంత్రిణం .
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పంత్రపుశ్పం సమర్పయామి.

ప్రదక్షిణం:
శ్లో: కామరూపి కామదాయి సర్వలోకైక కామనే,
పరిభ్రామిత సర్వాందే స్వీకురుష్వ ప్రదక్షిణాన్.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అనేనా సమయాకృత షోడశోపచార పూజానేన భగవతీ సర్వాత్మికా శ్రీ వైభవలక్ష్మి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు.

శ్రీ వైభవలక్ష్మి వాయనదానము: (Vaibahava Lakshmi Vayana Danam)

ఇచ్చేవారు : ఇందిరా ప్రతిగృహ్ణాతు
పుచ్చుకునేవారు : ఇందిరావై దదాతిచ
ఇద్దరు : ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఇచ్చేవారు : ఇస్తినమ్మవాయణం
పుచ్చుకునేవారు : పుచ్చుకున్తినమ్మ వాయనం
వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.

శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ (Story of Vibhava Lakshmi Vrat)

పూర్వమోకప్పుడు కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుని చూసి, "ఓ ప్రాననాదా! భూలోకంలో మానవులందరూ ధనార్జనకోసం ఎడతెరపి లేని శ్రమలను భావిస్తూనే వున్నారు. అయినా వారిలో అతికొద్దిమంది మాత్రమె ఐశ్వర్య వంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి?" అని, అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి - "దేవీ! సర్వమూ వైభవలక్ష్మిదెవి దయనుబట్టి వుంటుంది. శాస్త సంపదలకూ, ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత, కాబట్టి, ఎవరయితే ఈ సత్యాన్ని గ్రుతించి - ఆ వైభవలక్ష్మియన్దు, భక్తి కలిగి సదా ఆమెను ఆరాదిస్తుంటారో ఆవైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూఉంటారో వారిపట్ల మాత్రమె ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిమ్పబడతాయి.

అలా ఆమె దయకు పాత్రులైన వాళ్లుమాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభావాలనూ సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి, అంట తమ స్వయం కృషేయని ఐర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని యీసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అగుచుంది. కాబట్టి, ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిన్చాలు. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరిసంపదలతో, రాజవైభావాలతో తులతూగుతారు." అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభూ! ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహాత్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి. అని వేడగా, ఆ పరమేశ్వరుడు మరల ఈవిధముగా చెప్పసాగాడు. ఓ దేవీ! అత్యంత పున్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పెదను శ్రద్దగా వినుము అని ఈ విధముగా చెప్పసాగెను.

 పూర్వము ఒకప్పుడు బృగుమహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సుచేసేను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్ష మయ్యి ఏమి వరముకావాలో కోర్కోమనేను. అప్పుడు బృగుమహర్షి ఆమెకు నమస్కరించి "ఓ తల్లీ ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరములు శక్తి, యుక్తి, భుక్తి అను వాటి

పైననే నడుస్తోంది. మహామయయైన నీ శక్తి కళ పార్వతియై పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవిమ్పబడుతోంది. నీ విద్యాకళ సరస్వతి యై బ్రహ్మతో మసలుతుంది. ఇక స్థితి కారకమైన నీయొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు " అని కోరెను. ఆ తల్లి అతనికోర్కెను మన్నించెను. తత్ఫలముగానే పరాశాక్తియోక్క సంపత్కల బ్రుగువుకు వైభవలక్ష్మిగా అవతరించినది. బృగువు ఆమెను విష్ణువుకు ఇచ్చి వేవాహము జరిపించినాడు. శ్రీ హరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ యెనలేని సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కాని ఐశ్వర్య మత్తతతో ఇంద్రుడు చేసిన ఒకానోకచోట దోశానికిగాను దూర్వాసుడు ఇచ్చిన శాపంకారణంగా - ఆ వైభవలక్ష్మి సాగత అయి పోయినది .

ఇంద్రుడు దరిద్రపీడుతుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్యా విరహ తప్తుడైన విశ్నువుకూడా, ఆలోచించి - లక్ష్మిమయమైన క్షీరసాగరాన్ని మదిన్చాడంవల్లనే పునః కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు - మందరగిరిని కవ్వంగాను, 'వాసుకి' అనే మహా సర్పాన్ని కవ్వపుత్రాతిగాను అమర్చి - క్షీరసాగరాన్ని మధించగా - వైభవలక్ష్మి పునః ఆ సముద్రంనుంచి ఆఅవిర్భవిన్చి లోకాలను కరుణించింది. ఆ సమయములో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్ధనలను మన్నించి ఆ తల్లి ఎనమిది మూర్తులుగా భాసించింది. ఆ ఎనమిది మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ఎనమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మిదెవి. ఆమెనే ఐశ్వర్య లక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు.

సర్వ ఐశ్వర్య ప్రదాయినిఅగు ఈ తల్లి మహాభిమాని, ఆమెయందు కొంచేముకూడా అపచారము జరిగిన మన్నించాడు. అందుకు ఉదాహరణ చెబుతాను విను, పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులు అందరు కలిసి లక్ష్మిదెవి తండ్రి అయిన బ్రుగువును నిర్దేశించినారు. తత్కారణంగా భ్రుగువు ముందుగా సత్యలోకానికి వెళ్లి న భ్రుగువుకి, అక్కడ అవమానము ఎదురౌతుంది. తనరాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మ దేవుని శపించి కైలాసానికి వేల్లుతాడు. అక్కడకూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఎమిఎరుగానివారి వలెననే సరస సల్లాపములలో మునిగి వుండిరి, అది చూసిన భ్రుగువు పట్టరానికోపముతో అక్కడనుండి వైకున్టమునకు చేరాడు. ఇక్కడ లక్ష్మే నారాయణలు ఇద్దరు పాచికలాటలో ఉండి పోయి భ్రుగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరానికోపముతో విష్ణువుయొక్క వక్షస్తలముపైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతముగా భ్రుగువును ఆరాధించి, ఆయనను శాంతపరచి పంపివేశాడు. కాని అన్డునిమిత్తమై ఆ లక్ష్మిదెవి అలిగినది. తన నివాస స్థానమైన విష్ణు వక్షస్తలాన్ని తన్నిన భ్రుగువును శిక్షించకుండా వదిలిన శ్రీహరిమీద కూడా అలిగి వైకుంటాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆవిధంగా వైకున్టమును వదిలి భక్తులమీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురము నందు ఉండెను.

ఓ ప్రార్వతీ! భక్త సులభ, అత్యంత కరుణామయీ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము.



చాలాకాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు వుండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే వున్నతవంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తులద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లెవారు. కాని, రానురాను వారిలో అహంకారము తలెత్తింది. దైవచింతన తగ్గింది, శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహాన్ని విస్మరించి అంటా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు.

మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తోందనే భావన కలిగింది. "ఇందులో వైభవలక్ష్మి దయఎముంది" నానోట్లో విద్య ఉంది, ఎంతగోప్పవాల్లయినా నాకు డబ్బులిచ్చి సంమానించక ఏం చేస్తారు? అని భావించాడు. ఎంతటి ధనవంతులైన తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మి దేవి కోపగించి అతనికి తగిన గుణపాటం చెప్పదలంచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువలేకుండా పోయింది. సంపాదించిన ధనం అంతయు ఖర్చు అయిపొయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమతిన్చాసాగారు.

రాజాస్థానంలో ఉపదళాదిపతి వుండే సుశీల భర్త, ఒకానొక యుద్దంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి, అహంకారముతో తనబలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణం అని భ్రమించాడు. అందుకు ధన లక్ష్మి ప్రమేయము యెమిలెదుఅని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆఅశ్రయిన్చి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి, తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానములో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటిని స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది.

వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహముకన్న తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారి తనంతో మాత్రమె సంపాదిన్చాగాలిగాను. అంతేగాని సంపాదించిన దంతా దైవానుగ్రహమువలననే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. ఆటను దైవారాధనలు అన్నియు మానివేశాడు. అతని తలపోగారువలన సాతివ్యాపారులు అతడికి సహకరించాదము మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గుతుంది. అంతటితో అతని కుటుంబము దారిద్ర్యములో మునుగుతుంది.

ఇక చివరిదైన విశాల భర్త మంచివాదేగాని, అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలేగాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడము దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడుమిత్రులవల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనతా హారతి కర్పూరంవలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడై పోయాడు. ఋణదాతల పీడా, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్ఘుడుగా మారతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు.

అయినా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఎదోకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మి దేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు వుండినా ఫర్వాలేదు. తమ బిడ్డలకయినా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదేపదే ఆ లక్ష్మేదెవిని ప్రార్ధించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయగాలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్ధిస్తున్న శుభ సందర్భములో ఆ వైభవలక్ష్మి దేవి ఒక వృద్ద స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఇలా చెప్పా సాగింది.
"పిల్లలూ! మీ భక్తి ప్రప్త్తుల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతిత్వరితంగా సిద్దిన్చే మార్గం చెబుతాను, తక్షణమే మీ అక్కాచెల్లెళ్లు నలుగురూ మీ మీ ఇళ్ళల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి.

అవ్వ చెప్పిందంతా విన్న అక్కాచెల్లెళ్లు, అత్యంత సంతుష్ట హృదయులై ఓ అవ్వా ఇంతకూ ఈ వ్రతాన్ని ఏవిధంగా చెయ్యాలి. ప్రస్తుతము మేము దారిద్ర్యములో వున్నాముగదా! ఆ వ్రతానికి యెంత ఖర్చు అవుతుంది? అని ప్రశించినారు. అందుకా వృద్ద మాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది.

ఓ అమ్మాయిలూ! ఇదేమి ఖర్చుతో కూడిన పనికాదు. ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారములుగాని, శుక్రవారములుగాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు, తాము మ్రోక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారమునాటి మరునాడు వచ్చే శుక్రవారమునాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకొనే వారు ఆఖరి శుక్రవారమునాడే ఉద్యాపన చేసుకోవాలి.

ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారమునాడు గాని ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలన్తుపోసుకొని "అమ్మ వైభవలక్ష్మి దేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిన్స్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంతో సంత్రుప్తురాలువై నా కోరికలను నెరవేర్చు" అని మ్రోక్కుకోవాలి. ఆ రోజంతా వుపాసముంది ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచీ శుబ్రతలూ సదాచార పాలనము ముఖ్యము.

ఏ ఇంటిలో వారయితే అతిధి అభ్యాగతులకు దాసులవలే ఉంది, వారి పాదములను కడిగి, ఆ తీర్ధం శిరస్సున చల్లుకొని, తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరచి, సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ యింత పిత్రుదేవతలూ దేవతలూ సదా ఆచరిమ్పబడుతూ ఉంటారో, ఏ ఇంటి వారు పరులపట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై, నిత్య సంతోశిగా వుంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా వుంటుంది.

పూజా విధానము: (Vibhav Lakshmi Pooja Vidhanam)

పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుబ్రంగా అలికి పంచావర్నములతో గాని లేదా బియ్యపుపిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను బెట్టి దాని మీద నూతన వస్త్రం చతురశ్రంగా పరచి, ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి, దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలషంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిదిఆకులుగాని వుంచి వాటిమీద కొబ్బరికాయను, దానిమీద ఒక రావికలగుద్దను పెట్టి, ఆ మీదుట ఒక యెర్రని పువ్వును పాత్రలో వుంచి, అందులో ఒక బంగారు, వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేనివాళ్ళు ఆ సమయానికి చలామణిలో వున్న నాణెమును ఉంచాలి. నేటితో దీపాన్ని వెలిగించి, అగరువత్తులతో ధూపం వెయ్యాలి.

అమ్మాయిలూ! అమ్మవారికి లక్ష్మిగణపతి అన్నా శ్రీ చక్రమన్నా చాలా ఇష్టము. కాబట్టి, ముందుగా లక్ష్మిగణపతిని , శ్రీ చక్రాన్ని పూజించి, అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్ధాన్ని నివేదన చెయ్యాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపుకోమ్ములను వుంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్ధము చెయ్యలేనివారు బెల్లం పటికబెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్ళను సంతానాన్ని కోరుకొనేవారు మామిడిచెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకొనేవారు తులసి చెట్టు మొదలులోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకొనేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట పూయాలి. కేవలం ధనాకాంక్షులైన వారు ఆ నీటిని తాము మాత్రమె స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరిన్చాదముద్వారా నిరుద్యోగులు వుద్యోగావంతులవుతారు, అవివాహితులకు వివాహము జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏయే కోరికలుంటే ఆ ఆ కోరికలు నెరవేరుతాయి. అని ముగించిండా వృద్ద మాత.

తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లు నలుగురూ వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారములపాటు ఆ వ్రతాన్ని మ్రోక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు. నలుగురు కడుపేద వాళ్ళయి వున్దతముచేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని వుంచి పూజించింది. సుశీల రూపాయి నానాన్నే వుంచి పూజించింది. గుణశీల తన ఇంట వున్న వెండి నాణాన్ని వుంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కేరను వుంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏయే రూపాలలో ఆరాదిన్చిననూ వారి హృదయంగత భక్తి భావాలనే ప్రదానన్మ్గా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి దేవి.

వారు వ్రతము ప్రారంభించిన అతికొద్ది సమయములోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి, తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లబించాయి. తద్వారా వారు వున్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ద నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్టుడైన, సుశీల భర్తను విడుదల చేసి, అతనినే దలపటిగా అభిషేకించి యుద్దానికి పంపక తప్పలేదు. ఆ యుద్దంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ మన్నిమ్పబడి, దలపటిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది.

ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పులవలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతి విషయములో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది.

ఇక చివరిదైన విశాల వ్రతారంభం చయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనములన్నియు ఒకదాని తరువాత ఒకటిగా అన్నింటిని వదిలి వేసినాడు. తన కుటుంబము పట్ల ఏంటో శ్రద్ధ కనబరచినాడు. వారి కుటుంబము కూడా పూర్వముగానే సుఖసంతోశాములతో జీవించసాగింది.

కాబట్టి స్త్రీలుగాని, పురుషులుగాని, ఆబాలగోపాలమేవారు తనను పూజించినా సరే, తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కెలను నేరవేర్చును.

శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ సమాప్తం.
Related Posts Plugin for WordPress, Blogger...