ముందు తెలిసెనా ప్రభూ, ఈ మందిరమిటులుంచేనా
మందమతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో, కాస్త ||ముందు||
అందముగా నీకనులకువిందులుగా, వాకిటనే
సుందర మందారకుంద సుమదళములు పరువనా
దారిపొడుగునా తడిసిన పారిజాతములపై
నీఅడుగుల గురుతులే నిలిచినా చాలును ||ముందు||
బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానేరావు
ఎదురరయనివేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిమిసము నను వదలిపోక నిలుపగ
నీపదముల బంధింపలేను హృదయము సంకెలజేసి ||ముందు||
mundu telisenaa prabhuu, ii mandiramiTulunchEnaa
mandamatini, niivu vachchu madhura kshaNamEdO, kaasta ||mundu||
andamugaa niikanulakuvindulugaa, vaakiTanE
sundara mandaarakunda sumadaLamulu paruvanaa
daaripoDugunaa taDisina paarijaatamulapai
niiaDugula gurutulE nilichinaa chaalunu ||mundu||
bratukantaa eduruchuutu paTTuna raanEraavu
edurarayanivELa vachchi iTTE maayamautaavu
kadalaniika nimisamu nanu vadalipOka nilupaga
niipadamula bandhimpalEnu hRdayamu samkelajEsi ||mundu||
(Telugu script generated with Lekhini)
Poet: Devulapalli Krishnasastry
Film: Meghasandesam
Audio is available on the Internet for listening (& downloading). An excellent song for learning.