Pages


Showing posts with label Kosaraju. Show all posts
Showing posts with label Kosaraju. Show all posts

Lord Lyrics of Telugu Song - "rukminamma rukminamma"

Film: Uyyala Jampala (1960)
Lyrics: Kosaraju
Music: Pendyala
Singer: P. Susheela & Chorus

రుక్మిణ()మ్మ, రుక్మిణ()మ్మ

కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ


కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు

శిశుపాలుడికన్న శ్రీకృష్ణుడు మిన్న

రమణిప్రేమ సొంపు నువ్వు రాయబారమంపు

చిలుకచేత కబురుపంప చెలుడు రాకపోడమ్మ


రుక్మిణమ్మ, రుక్మిణమ్మ

కోరుకొన్న వరుడుకొరకు నోచాలమ్మ


గౌరి పూజ చేసి గర్భగుడిలో వేచి

ఎదురుచూడవమ్మ నీ బెదురు మానవమ్మ

రమ్యమైన వాడు ఒక రధము తెచ్చినాడు

తేరుమీద ప్రియునితోను తేలి సాగిపోవమ్మ బాల రుక్కమ్మ


రుక్మిణమ్మ రుక్మిణమ్మ

ఎంతమంచి నోము నువ్వు నోచావమ్మ



అట్లతద్దిరోజు మా ఆడపిల్లల మోజు

అంతాగుమిగూడి సయ్యాటపాటలాడి

తదియ చంద్రుచూచి మాతనివితీర నోచి

అట్లతద్ది నోము నోచ అందగాడె మొగుడమ్మ బాల రుక్కమ్మ


రుక్మిణమ్మ రుక్మిణమ్మ

ఉయ్యాల జంపాల ఊగాలమ్మ

ఉయ్యాల జంపాల ... ఉయ్యాల జంపాల

rukmiNa(na)mma, rukmiNa(na)mma

kRshNamuurtitO nuvvu kulakaavamma


kannepilla manasu mii annakEmi telusu

SiSupaaluDikanna aa SriikRshNuDu minna

ramaNiprEma sompu nuvvu raayabaaramampu

cilukacEta kaburupampa celuDu raakapODamma


rukmiNamma, rukmiNamma

kOrukonna varuDukoraku nOcaalamma


gauri puuja cEsi aa garbhaguDilO vEci

edurucuuDavamma nii beduru maanavamma

ramyamaina vaaDu oka radhamu techcinaaDu

tErumiida priyunitOnu tEli saagipOvamma baala rukkamma


rukmiNamma rukmiNamma

entamanchi nOmu nuvvu nOcaavamma



aTlataddirOju maa aaDapillala mOju

antaaagumiguuDi sayyaaTapaaTalaaDi

tadiya candrucuuci maatanivitiira nOci

aTlataddi nOmu nOca andagaaDe moguDamma baala rukkamma


rukmiNamma rukmiNamma

uyyaala jampaala uugaalamma

uyyaala jampaala ... uyyaala jampaala


[లోగడ, తపాల వ్రాతలలో, అట్లతద్ది పండుగ (1) గురించి ఒక సుదీర్ఘ వ్యాసము వ్రాసితిని. ఇప్పుడు తెలుగు సంస్కృతి అభిమానులకు, ముఖ్యముగా తెలుగు ఆడపడుచుల కొఱకు ఈపాట సాహిత్యము ఇక్కడ పొందుపర్చితిని.ఈనాడు ఎందరో వయసుకొచ్చిన యువతీ యువకులు కళ్యాణ ఘడియల గురించి వేచి తపించుచున్నారు. వారికి నేను వ్రాసిన (ఇందులో నా సొంత ప్రజ్ఞా పాటవము ఏమి లేదు!) రెండు బ్లాగ్స్ పనికి వస్తాయని ఆశిస్తాను. తల్లి గౌరి దేవి అశీసులు కాంక్షిస్తూ. I wish I had posted these lyrics two months earlier. Sorry readers.]


1. http://tenneti-rao.sulekha.com/blog/post/2010/04/third-moon-festival-atla-taddi.htm





Related Posts Plugin for WordPress, Blogger...